కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలో ఆదివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కదం తొక్కారు. బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం సాకారం చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణంలో భారీగా జనం తరలి వచ్చారు. సామాజిక సాధికార యాత్రతో తుని రోడ్లు జనసంద్రాన్ని తలపించాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, జక్కంపూడి రాజా, జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.