కర్నూలు జిల్లాలో పొలం వెళ్లిన రైతును అదృష్టం వరించింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన పొలంలో కంది పంటను సాగు చేశారు. ఈ క్రమంలో పొలంలో పనులు చేస్తుండగా ఆమెకు ఓ రాయి దొరికింది.. వజ్రంగా భావించి అనుమానంతో.. ఓ వజ్రాల వ్యాపారికి చూపించగా అది వజ్రం అని ఆ రైతుకు చెప్పారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ వజ్రం పైకి తేలి ఉంటుందని భావిస్తున్నారు. ఆ వజ్రాన్ని వ్యాపారి రూ.6 లక్షలకు కొనుగోలు చేశారు. గతంలో వజ్రాలు దొరుకుతున్నాయి అంటే అదృష్టంగా భావించేవాడినని.. కానీ తనకు వజ్రం దొరకడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, కొత్తూరు,పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. దీంతో జిల్లాతో పాటూ పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి అక్కడ గాలిస్తున్నారు. అంతేకాదు కర్నూలు జిల్లాకు పొరుగునే ఉండే కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా ఎక్కువమంది జనాలు వజ్రాల వేటకు వస్తున్నారు. అంతేకాదు స్థానిక రైతులు, కూలీలు కూడా వజ్రాల కోసం రోజుల తరబడి పొలాల్లోనే వెతుకులాట ప్రారంభించారు. ఒక్క వజ్రం అయినా దొరక్కపోదో అన్న ఆశతో ఉన్నారు.