గుంటూరులో ఆదివారం సాయంత్రం సరదాగా పార్కులో గడపడానికి వచ్చిన మహిళలు, యువతుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ చిన్న వివాదం కొట్టుకునే వరకు వెళ్లింది. నగరంలో ఇటీవల కొత్తగా గాంధీ పార్క్ ప్రారంభించారు. అక్కడ సెల్ఫీల కోసం ఓ లొకేషన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సెల్ఫీలు తీసుకునేందుకు మహిళలు, యువతులు పోటీపడ్డారు. ఈ క్రమంలో జరిగిన వివాదంలో జుట్లు పకట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసిన వీరు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ ఘటన గురించి ఆరా తీస్తే.. సెల్ఫీలు తీసుకునే క్రమంలో రెండు గ్రూపులు పోటీ పడ్డాయని చెబుతున్నారు. ముందు సెల్ఫీలు తామే దిగాలని , తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని యువతుల మధ్య రాజుకున్న వివాదం.. శృతిమంచిపోయింది. అది కాస్తా మాటామాటా పెంచి వాగ్వాదం, ఘర్షణకు కారణమైంది.. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు యువతులు.. సెల్ఫీల కోసం ఇలా ఆడపిల్లలు కొట్లాటకు దిగడంతో స్థానికులు సైతం అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అమ్మాయిల ఘర్షణను కూడా ఓ వ్యక్తి మొబైల్ రికార్డు చేయగా.. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.