ఉత్తరాఖండ్‌లోని నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయి.. లోపలి చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు చివర దశకు చేరుకున్నాయి. భూమికి సమాంతరంగా చేపట్టిన పనులు ఆగిపోయిన చోట నుంచి ‘ర్యాట్ హోల్ మైనర్లు తవ్వకం చేపట్టి మిగతా దూరం డ్రిల్లింగ్ దాదాపు పూర్తి చేశారు. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపుతున్నారు. మరో 2 మీటర్ల దూరంలోనే కార్మికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మాన్యువల్ డ్రిల్లింగ్, పైపింగ్ పనులు పూర్తయినట్టు ప్రకటించారు. సొరంగం లోపలికి పంపించిన గొట్టం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూలీలను ఒక్కొక్కరిగా బయటకు తీసుకురానున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారు మాక్ డ్రిల్ కూడా పూర్తిచేశారు.