స్పీకర్ బిమన్ బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొత్తానికి మంగళవారం సస్పెండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ‘రాజ్యాంగ దినోత్సవం’పై చర్చ సందర్భంగా సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ రికార్డుల నుండి ప్రకటనను తొలగించాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు, దీనిని అనుసరించి ప్రతిపక్ష నాయకుడు అధికారి నేతృత్వంలోని బిజెపి ఎమ్మెల్యేలు సభ వెల్‌లోకి దిగి బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిజెపి శాసనసభా పక్షం స్పీకర్ నిర్ణయాన్ని "రాజ్యాంగ విరుద్ధం" అని అభివర్ణించింది మరియు సభ నుండి వాకౌట్ చేసింది.