దండేపల్లి మండలంలోని అల్లీపూర్ అడప ప్రశాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి 13 సంవత్సరాల క్రితం వివాహం జరగగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఎకరం పొలంతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేయగా నష్టం వచ్చింది. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 20న పురుగుల మందు తాగగా, కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.