దక్షిణ అండమాన్ సముద్రం మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని ఐఎండీ అధికారులు తెలిపారు. వాయుగుండం రానున్న 48 గంటల్లో నైరుతి, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని తెలిపారు. తుపానుగా బలపడితే దీనికి 'మిచాంగ్' అని నామకరణం చేయనున్నారు. దీని ప్రభావంతో నేటి నుంచి డిసెంబర్ 1 మధ్య దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.