వైసీపీ పార్టీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..... రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రావాలి జగన్.. కావాలి జగన్ అంటున్న జనం. మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా అమలు చేస్తున్న జగనన్న. జయమంగళ వెంకటరమణకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని మోసం చేసి తన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. అన్యాయం జరిగిన చోట న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ జగనన్న జయమంగళ వెంకటరమణను ఎమ్మెల్సీగా చేశారు. తెలుగుదేశంలో సామాజిక న్యాయం లేదు. కానీ జగనన్న పాలనలో నాలుగున్నరేళ్లుగా సామాజిక న్యాయం వర్ధిల్లుతోంది. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత జగనన్నది. చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పని చేసి ఒక్క బీసీని అయినా రాజ్యసభకు పంపించాడా? బాబుకు మద్దతు పలికే బీసీ నేతలు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? కేబినెట్‌లో సామాజిక న్యాయం చేసి 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన ఘనత జగనన్నది. చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకోవాలి? 17 ఎమ్మెల్సీల్లో 14 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. ఇలా చంద్రబాబు ఇచ్చాడా? సామాజిక న్యాయం అంటే ఇదే. పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు అవ్వాలని కోరుకున్న సీఎం జగన్. బాబు హయాంలో చదువుల్లో రాష్ట్రానిది 15వ స్థానం. నేడు 3వ స్థానం. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నా పచ్చ మీడియా విషం చిమ్ముతోంది అని ఆరోపించారు.