తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వేసిన పిటిషన్ల జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓటు కు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలంటూ.. ఆ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని ఆర్కే మరో పిటిషన్ దాఖలు చేశారు . 'మనోళ్లు బ్రిఫ్డ్ మీస వాయిస్ చంద్రబాబుదేనని గతంలోనే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిర్ధారణ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ రిపోర్టులో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావన వచ్చినట్లు ఆర్కే పిటిషన్‌లో పేర్కొన్నారు.