వైసీపీ పార్టీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించి వాళ్ల కాలనీలు ప్రత్యేకంగా ఉండేవి. అది సామాజిక అంటరానితనం. జగనన్న వచ్చాక అందరికీ కలిపి జగనన్న కాలనీలో ఒకే దగ్గర ఉంచుతున్నారు. ఇది సామాజిక సాధికారత. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలను చిన్నచూపు చూసి అవహేళనగా మాట్లాడారు. అది పెత్తందారీ వైఖరి. ఈరోజు జగనన్న వచ్చాక అదే బీసీలను అందలాలు ఎక్కించారు. ఇది సామాజిక సాధికారత. మైనార్టీలకు బాబు హయాంలో అవకాశాలు ఇవ్వకుండా ఆత్మగౌరవం దెబ్బతీశారు. అది సామాజిక వివక్ష. జగనన్న హయాంలో మైనార్టీలకు ఏకంగా డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇది సామాజిక సాధికారత. గిరిజనులను పట్టించుకోకుండా కొండలకే పరిమితం చేస్తూ మోసం చేసిన చంద్రబాబు. అది సామాజిక వెనుకబాటుతనం. జగనన్న వచ్చాక గిరిజనులకు అన్ని సేవలు, భరోసా దక్కింది. ఇది సామాజిక సాధికారత. బడుగు బలహీన వర్గాలు జగనన్న వచ్చే ముందు, జగనన్న వచ్చాక అని మాట్లాడుకొనేలా పాలన సాగుతోంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల బాగోగుల కోసం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4.80 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చారు. ఇందులో 80 శాతానికిపైగా లబ్ధి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకే. సచివాలయ వ్యవస్థ తెచ్చి ఉద్యోగాలిచ్చారు. ఇందులోనూ 80 శాతం ఈ వర్గాలకే. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా కార్పొరేట్ వైద్య సేవలు. ప్రభుత్వ సేవలన్నీ ఇంటి వద్దకే వస్తున్నాయి. రేషన్, పెన్షన్ ఇంటివద్దే అందుతోంది. మనకోసం పరితపిస్తూ ముందుచూపుతో నడుస్తూ, నడిపిస్తున్న జగనన్నకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంతా మద్దతుగా నిలవాలి అని పిలుపునిచ్చారు.