రాప్తాడు నియోజకవర్గంలో 50 వేల ఓట్ల తొలగింపునకు టీడీపీ నాయకురాలు పరిటాల సునీత కుట్ర పన్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి ఆమె ఈరోజు బిఎల్‌ఒలను బెదిరించుకుంటూ, వారిపై ఒత్తిడి తెస్తూ 27 వేల దరఖాస్తులను తొలగించేందుకు బిఎల్ఓల నుంచి స్క్రూటినీ లేకుండా ఎన్నికల అధికారులకు పంపారు. ఇంకా 23 దరఖాస్తులు సిద్దంగా ఉన్నాయని ఆమె ప్రకటన చేసింది. అంటే ఈ నియోజకవర్గంలో మొత్తం 50 వేల ఓట్లను తొలగించాలని పరిటాల సునీత కుట్ర పన్నుతోంది. దీనిపై కలెక్టర్ దృష్టికి, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మతో కలిసి కనగానపల్లి మండలం భానుకోట సమీపంలోని పంపనూరు తండా వద్ద 110.55 కోట్లు వ్యయంతో నిర్మించిన 220/132 కె.వి. విద్యుత్ ఉప కేంద్రం మరియు సంబంధిత లైన్లను ప్రారంభించారు.