వైసీపీ పార్టీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీల్లోని పేద వర్గాలను తన కుటుంబసభ్యులుగా భావించిన సీఎం జగన్. రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలన్నింటికీ జగనన్న అండగా ఉండి సంక్షేమ పథకాలు అందించారు. నీతివంతమైన పాలన అందిస్తున్నారు. అవినీతికి తావు లేదు. జన్మభూమి కమిటీలు, దొంగల కమిటీలు ఇప్పుడు లేవు. రెండేళ్లు కోవిడ్ ఉన్నా ఏ సంక్షేమ పథకాన్నీ ఆపకుండా ప్రజలకు అందించిన ఘనత జగనన్నది. పేదవాడి పిల్లల్ని సీఎం జగన్ చదివిస్తున్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నారు. కైకలూరులో పేద అక్కచెల్లెమ్మలకు 15 వేల ఇంటి స్థలాలు ఇచ్చారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రూ.746 కోట్లు అందించిన ఘనత జగన్మోహన్రెడ్డి గారిది అని అన్నారు.