వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా నేడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో వైయస్ఆర్ సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి మున్సిపల్ ఆఫీసర్ వరకు ర్యాలీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఆఫీస్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు హాజరుకానున్నారు.