ప్రతి మహిళా ఆర్ధికంగా ఎదగాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. పట్టణ మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా మన సీఎం జగనన్న ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్ సమీపంలో మెప్మా అర్బన్ మార్కెట్ ను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఉషాశ్రీచరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి మహిళా ఆర్ధికంగా ఎదగాలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అందులో భాగమే ఈ మెప్మా అర్బన్ మార్కెట్‌ను ప్రారంభించామన్నారు. వైయస్ఆర్ చేయూత, ఆసరాతోపాటు సున్నావడ్డీ రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా అర్బన్ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు.