2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి.. టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని.. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ముమ్మిడివరంలో యువగళం పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెడుతుందని.. అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదు మాది కాదని లోకేష్ అన్నారు. తన పాదయత్ర అడ్డుకోవడానికి వైసీపీ నేతలు చాలా ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ జగన్ మాట విన్న అధికారులు ఇప్పుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారని అన్నారు.