వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం పేద లకు వరంలాంటిదని తాడిపత్రి సబ్ డివిజన్ కంటి వైద్య నిపుణుడు మధుసూదన్ రాజు అన్నారు. బుధవారం రాయలచెరువు నం: 1 ప్రాథమిక పాఠశా లలో 62 మంది విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించిచారు. ముగ్గురు విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశామని మధుసూదన్ రాజ్ తెలిపారు. హెచ్ఎం జయమ్మ, ఉపాధ్యాయురాలు మునేశ్వరీ ఉన్నారు.