ఇంటి ముందు కాలువ నీళ్లు ఊడ్చుకునే విషయంలో గొడవ పడిన ఇరువర్గాలపై బుధ వారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాయల చెరువు గ్రామంలో బాబా ఫకృద్దీన్, షేక్ చాంద్ భాష, నరేష్ ఇంటి పక్కన ఉన్న సయ్యద్, జిగును దంపతులతో కాలువ నీళ్లు ఊడ్చుకునే సమయంలో గొడవపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. అనంతరం ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.