తాడిపత్రి పట్టణంలోని బిందెల కాలనీలో నీటి సమస్యను పరిష్కరించినట్లు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కాలనీవాసులతో కలిసి కుళాయిలను ప్రారంభించి మాట్లాడారు. సొంత నిధులతో బోరు వేయించి, ట్యాంకు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని, సమస్యలు తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.