గనుల్లో పేలుడు పదార్థాల ద్వారా బ్లాస్టింగులు చేసేటప్పుడు తప్పకుండా నిబంధనలు పాటించాలని డీఎస్పీ గంగయ్య సూచించారు. ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు తాడిపత్రి సబ్-డివిజన్ పరిధిలోని మైన్స్ యజమానులతో నిర్వహించిన సమావేశంలోబుధవారం ఆయన మాట్లాడుతూ గనుల్లో పేలుడు పదార్థాలు ఉపయోగించి బ్లాస్టింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్లాస్ట్ చేసేందుకు సంబంధిత మైన్స్, జియాలజీ విభాగాల అనుమతి తీసుకోవాలన్నారు.