మండల కేంద్రమైన నల్లమాడ లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సత్య సాయి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. బుధవారం నల్లమడ మండలంలోని కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధ్యక్షతన జగనన్నకు చెబుదాం కార్యక్రమం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.