శ్రీ సత్య సాయి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులు సత్వరమే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ చేతన్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్ హెచ్ 342, 716 జి జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ బెంగళూరు, కడప, విజయవాడకు సంబంధించిన పనులు పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారులకు సంబంధించి సేకరణ భూమి లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.