ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల ఆస్తి, నీటి కుళాయి పన్నులను వెంటనే వసూలు చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని ధర్మవరం మున్సిపల్ చైర్ పర్సన్ కాచర్ల లక్ష్మి అన్నారు. బుధవారం ధర్మవరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికారులు, కౌన్సిల్ సభ్యులు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తద్వారా ధర్మవరం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.