విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం జరిగింది. ధర్మవరం మండలం రేగాటి పల్లికి చెందిన నారాయణ మోటారు వేసి తన ఇంటి అవసరాలకు నీళ్లు పడుతుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. నారాయణ వ్యవసాయం చేస్తుంటాడని కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.