గుత్తి మండలం బేతాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ సందీప్ యాదవ్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. దీంతో యాడికి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ ను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తానని చెప్పారు.