పేదల సంక్షేమే ధ్యేయంగా జగన్ సీఎం పాలన సాగిస్తున్నట్లు వెలిగండ్ల మండల జడ్పిటిసి సభ్యులు గుంటక తిరుపతిరెడ్డి తెలిపారు. బుధవారం వెలిగండ్ల మండలంలోని నాగులవరం గ్రామంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే మనం ముందంజలో ఉందని పేర్కొన్నారు. అనంతరం సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు.