కనిగిరి టీడీపీ ఇంచార్జి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం కనిగిరి పట్టణంలోని స్థానిక 8వ వార్డు నందు మన ఊరు మన ఉగ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ముఖ్య మంత్రిగా చంద్రబాబుని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.