నేపాల్లో తొలిసారిగా స్వలింగ సంపర్కులు తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారు. లింగమార్పిడి మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం లామ్జంగ్ జిల్లాలోని డోర్డి గ్రామీణ మున్సిపాలిటీలో బుధవారం చట్టబద్ధంగా నమోదు చేయబడింది.
దక్షిణాసియాలో స్వలింగ వివాహాలను అధికారికంగా నమోదు చేసుకున్న తొలి దేశంగా నేపాల్ అవతరించడం గమనార్హం.