లైంగిక వేధింపుల కేసులను విచారించే ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులను మరో మూడేళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018లో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 1,023 కోర్టులను కేంద్రం కేటాయించింది.
వాటిలో 761 కోర్టులు 2019 నుంచి పని చేస్తున్నాయి. వీటిని మరో మూడేళ్లపాటు పొడిగిస్తూ మిగిలిన కోర్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు నిధులను అందజేయనుంది.