వివాహం చేసుకుని భర్త, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన యువతి తిరుమలలో హఠాన్మరణం చెందింది. విజయవాడకు చెందిన లక్ష్మీసాయి సంతోషి(21)కి హైదరాబాద్కు చెందిన భార్గవ్తో ఈనెల 23వ తేదీన వివాహమైంది.
28వ తేదీ మధ్యాహ్నం స్వామిని దర్శించుకుని బంగారు వాకిలి వద్దకు రాగానే లక్ష్మీసాయి సంతోషి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. తమకు ఎలాంటి అనుమానాలూ లేవని, కేసు వద్దని యువతి కుటుంబ సభ్యులు చెప్పారు.