భూగోళం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో ఒకటైన గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను పరిష్కరిం చేందుకు చేపట్టాల్సిన చర్యలపై గురువారం నుండి రెండు వారాల పాటు ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న కాప్ 28 సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 70వేల మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.
కాప్ 28 అంటే వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఒప్పంద చట్రపరిధి (యుఎన్‌ఎఫ్‌సిసిసి)లోని పక్షాల 28వ సమావేశం. రియో సదస్సు జరిగి, యుఎన్‌ఎఫ్‌సిసిసి ప్రారంభించిన మూడు దశాబ్దాల కాలంలో ప్రతి ఏటా ఈ పక్షాలన్నీ సమావేశమై వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, లక్ష్యాలపై చర్చిస్తుంది.