ముంబై మార్గంలో అందుబాటులోకి వచ్చే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంత భాగం ఆగస్టు 2026 నాటికి సిద్ధమవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
గుజరాత్‌లోని సూరత్ నుండి బిలిమోరా వరకు 50 కి.మీ. దూరం మొదట సిద్ధం చేయబడుతుందన్నారు. కోవిడ్‌కు ముందుతో పోలిస్తే కొత్త రైళ్ల సంఖ్యను పెంచామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 2,792 నుంచి 2,856కి పెరిగిందని పేర్కొన్నారు.