బీఎల్ఓ వేరిఫికేషన్ లేకుండానే ఒకేసారి భారీగా ఓట్లను తొలగిస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ఎన్నికల అధికారులని కలిసి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మార్వో ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో వైసీపీ నేతలు ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈ రోజు అర్థరాత్రి వరకు ఎలక్షన్ కమిషన్ (సీఈఓ) కార్యాలయంలో కూర్చుని ఆందోళన చేయాలని వచ్చామని చెప్పారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇవ్వడంతో దీక్షను విరమించుకున్నామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.