సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో విభిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. రాజస్థాన్‌లో మాత్రం బీజేపీకి సానుకూలంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా రాజస్థాన్ ఓటర్లు తమశైలికి అనుగుణంగా నడుచుకున్నట్లు.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా.. ఐదేళ్లకోసారి అధికారాన్ని మార్చే సంప్రదాయం పాటిస్తున్న రాజస్థాన్ వాసులు.. ఈసారి కూడా ఇదే పద్ధతి ఫాలో అయినట్లు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్ శాసనసభ సామర్థ్యం 200 కాగా.. 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 101. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. బీజేపీ ఈ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైమ్స్‌నౌ ఈటీజీ ఎగ్జిట్‌పోల్ ఈసారి రాజస్థాన్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని వెల్లడించింది. బీజేపీ 108 నుంచి 128, కాంగ్రెస్ 56 నుంచి 72, ఇతరులు 13 నుంచి 21 చోట్ల విజయం సాధిస్తారని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ అంచనావేసింది.
రాజస్థాన్‌లో బీజేపీకి 94 నుంచి114 సీట్లు, కాంగ్రెస్‌కు 71 నుంచి91 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. ఇతరులకు 9 నుంచి 19 స్థానాలు దక్కే ఛాన్సు ఉందని పేర్కొంది. దైనిక్ భాస్కర్ మాత్రం బీజేపీ బొటాబొటీ మెజారిటీ దక్కే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. బీజేపీకి 98 నుంచి 105, కాంగ్రెస్‌కు 85 నుంచి 95 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఇతరులకు పది నుంచి 15 సీట్లు రావచ్చని వెల్లడించింది. అటు ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 86 నుంచి 106, బీజేపీకి 80 నుంచి 100 సీట్లు రావచ్చని పేర్కొంది. బీఎస్పీకి ఒకటి నుంచి రెండు, ఇతరులకు 8 నుంచి 16 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ సైతం ఇదే రీతిలో అంచనా వేశాయి. బీజేపీ 80-90, కాంగ్రెస్ 94-104, ఇతరులు 14-18 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది .
మరోవైపు జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాజస్థాన్‌లో ఈసారి బీజేపీ పక్కానంటూ తేల్చేసింది. బీజేపికి 100-122, కాంగ్రెస్ 62-85, ఇతరులు 14-15 స్థానాలలో విజయం సాధిస్తారని అంచనా వేసింది. పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ కూడా రాజస్థాన్‌లో అధికారం చేతులు మారుతుందని స్పష్టం చేశాయి. బీజేపీకి 105-125 సీట్లు, కాంగ్రెస్‌కు 69-91, ఇతరులకు 5-15 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం ఈసారి రాజస్థాన్‌లో బీజేపీ 115-130 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ 65-75 సీట్లకు పరిమితమవుతుందని ఈ సర్వే అంచనావేసింది. ఇతరులు 12 నుంచి 19 స్థానాలలో విజయం సాధిస్తారని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. బీజేపీకి 100 నుంచి 110 స్థానాలు, కాంగ్రెస్‌కు 90 నుంచి 100 స్థానాలు, ఇతరులకు 5 నుంచి 15 స్థానాలు వస్తాయని టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.