విశాఖ, గాజువాకలో విచిత్ర ఘోర సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... ఆ ముగ్గురు మంచి స్నేహితులు. కానీ ఒక్క విషయంలో మాత్రం అభిప్రాయ బేధం వచ్చింది. అది కాస్తా గొడవగా మారి హత్యకు దారి తీసింది. ఇంతకీ ఆ కారణమేంటో తెలిస్తే అవాక్కవుతారు. సిల్లీ కారణం.. కేవలం దుప్పటి కోసం గొడవ జరిగింది. అది కాస్తా ముదిరి స్నేహితున్ని మరో ఇద్దరు స్నేహితులు కలిసి హత్య చేశారు. దుప్పటి కోసం కిరణ్, రాము, మోహన్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కిరణ్‌ను రాయితో కొట్టి రాము, మోహన్ హతమార్చారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.