డిసెంబర్ 4 సాయంత్రం 'మిచాంగ్' తుఫాను చెన్నై- మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసింది. తుఫాను కారణంగా తిరువళ్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం (శనివారం) అల్పపీడనంగా కేంద్రీకృతమై చెన్నైకి ఆగ్నేయ నుంచి 790 కి.మీ దూరంలో ఉంది. తాజాగా వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని.. ఇది రేపటి తీవ్ర అల్పపీడనంగా మారి తుఫానుగా తీవ్రమవుతుంది. డిసెంబర్ 4 నాటికి చెన్నై, మచిలీపట్నం మధ్య దాటుతుందని వాతావరణ అధికారులు భావిస్తున్నారు. దీనిపై ప్రభావంతో ఉత్తర తమిళనాడులో వచ్చే నాలుగు రోజులు, ప్రధాన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డెల్టా జిల్లాల్లో డిసెంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, డిసెంబర్ 3న తిరువళ్లూరు నుంచి మైలదుత్తురై ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, పక్కనే ఉన్న వేలూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పెరంబూర్, తంజావూరు, తిరువారూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ 4న తిరువళ్లూరులో అతి భారీ వర్షాలు కురుస్తాయని, చెన్నై, కాంచీపురం, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, చెంగల్‌పట్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు... విలుపురం, కళ్లకురిచిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.