పేదలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రామగిరి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. రామగిరి మండలం నసనకోట గ్రామంలో రైతు భరోసా కేంద్రం, వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ఎమ్మెల్సీ మంగమ్మ తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం దుబ్బారపల్లిలో వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అక్కడే రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. అక్కడి నుంచి పేరూరుకు చేరుకుని సచివాలయం -1 పరిధిలో వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడే ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సచివాలయ పరిధిలోని ప్రజలకు రూ. 31 కోట్ల వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ..వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సంపన్న వర్గాలు, పేద వర్గాలు మధ్య సమానత్వం తీసుకొచ్చారు. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారిని ఉన్నతస్థానాల్లో కూర్చోబెట్టారు. జనాభా ప్రాతిపదికన కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. వైయస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా అన్ని పార్టీల వారు డబ్బులు తీసుకున్నారు. ఇన్‌ఫుట్ సబ్సిడీలు తీసుకున్నారు. అన్ని పార్టీలు, వర్గాల వారు పథకాలు తీసుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసం చేశాడు. వైయస్ జగనన్న వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలన్నింటినీ 60 లక్షల మంది అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 60 లక్షల మంది మహిళలకు సున్నా వడ్డీకి రుణాలిచ్చారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,500 డబ్బులు ఇస్తున్నారు. ప్రతిదశలోనూ మహిళలకు అండగా నిలిచారు. 2 లక్షల 40 వేల కోట్ల డబ్బులను సంక్షేమ పథకాల ద్వారా పేదల అకౌంట్లలో జమ చేశారు. అలాంటి ముఖ్యమంత్రిని మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.