ఓట్ల తొలగింపుపై బల్క్‌గా ఫామ్ - 7 తీసుకోకూడదని ఈసీ చెప్పిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఆగష్టు నెలలో విశ్వేశ్వరరెడ్డి ఓట్లు తొలగించాలని బల్క్‌గా ఫిర్యాదు చేశారని.. ఇదే విషయంపై మీద పరిటాల సునీత కూడా లేఖ ఇచ్చారని తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన దాని మీద విచారణ చేశారని.. కానీ పరిటాల సునీత ఇచ్చిన మీద ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఈ ద్వంద్వ వైఖరినే నేను తప్పుబట్టానని.. ఎవర్నీ బెదిరించలేదు. నేను ఎన్నికల సంఘాన్ని, కలెక్టర్లను బెదిరిస్తున్నారని అంటున్నారు. నేను బ్లాక్ మెయిల్ చేయను. విశ్వేశ్వరరెడ్డి బతుకంతా బ్లాక్ మెయిల్.. విద్యార్థి దశ నుంచి ఇదే చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేస్తే తప్పేంటి. నాపై కేసులు పెట్టాలంటారు.. ఏ కేసైనా పెట్టుకోండి. తప్పుడు సమాచారం ఇచ్చిన విశ్వేశ్వర రెడ్డిపై వంద కేసులు పెట్టాలి. అధికారులను ఎవరూ పని చేసుకోనివ్వలేదు. తహసీల్దార్లు, బీఎల్ఓ మీద చర్యలు తీసుకునే వరకు ఒత్తిడి చేస్తూనే ఉంటా’’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 8 మంది కలెక్టర్లు ఇలా నిబంధనలకు విరుద్ధంగా చేశారన్నారు. వీటిన్నింటిపై రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని తెలిపారు. సిటిజన్ ఫోరంలో సాక్షాత్తు జడ్జిలు, ఐఏఎస్‌లు ఉన్నారన్నారు. తప్పులు ఎక్కడ జరుగుతాయో అక్కడ వారు విచారణ చేస్తారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.