ఏపీవైపుగా మిచౌంగ్ తుఫాన్ ముంచుకొస్తోంది. మంగళవారం తీరం దాటే అవకాశం ఉంది.. ఇప్పటికే జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఈ మిచౌంగ్ ప్రభావం నేవీ డే వేడుకలపై కూడా పడింది.. డిసెంబర్ 4న జరగాల్సిన నేవీ డే వేడుకలు వాయిదా పడ్డాయి. తుఫాన్ ప్రభావంతో భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. దీంతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తుఫాన్‌ను ఎదుర్కునేందుకు ఫ్లడ్ రిలీఫ్, డైవింగ్ టీమ్స్, నెవల్ ఎయిర్ క్రాఫ్ట్స్, నేవల్ ఎయిర్ స్టేషన్స్ ,నేవల్ షిప్స్, మెడికల్ టీమ్స్ ను సిద్దంగా ఉంచేందుకు నేవీ డేను వాయిదా వేసినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. 1971 లో కరాచీ హార్బర్ పై ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో సాధించిన విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న నేవీ డేని నిర్వహిస్తారు. ఈ వేడుకల్ని ఈ నెల 10న నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు నావికాదళం కార్యాలయంలో.. మిలాన్ 2024 టీజర్‌ను తూర్పు నావికాదళ అధిపతి రాజేష్ పెందేకర్ విడుదల చేశారు. విశాఖపట్నంలో సోమవారం జరగాల్సిన నేవీ డే.. తుఫాన్ కారణంగా ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నామన్నారు. మిచౌంగ్ తుఫాన్ హెచ్చరికలతో సహాయ చర్యలు అందించేందుకు నావికా దళం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మిలాన్ మారి టైం ఫ్లీట్ రివ్యూ ని నిర్వహిస్తున్నామని.. సుమారుగా 50 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయన్నారు.