గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులు, వివిధ వృత్తులు చేసుకునే కార్మికులు, పేద ప్రజల జీవితంలో వెలుగు ప్రసరించిందని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు. టీజీ భరత్ మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టగానే ఇసుకను పేద వర్గాలకు అందుబాటులోకి తీసుకువస్తామని, భవన నిర్మాణ రంగం వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో భవన నిర్మాణ రంగం కుదేలైపోయిందన్నారు. ఈ రంగంపై ఆధారపడి పని చేస్తున్న కార్మికులు వైసీపీపై కసిపెంచుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలన్నారు. పరిశ్ర మలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించే బాధ్యతను తమ నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఖచ్చితంగా తీసుకుంటారని అ న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మహబూబ్, ఫయాజ్, అబ్దుల్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.