తీరం దాటిన మిచౌంగ్ తుపాన్ వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇవాళ ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తు.గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తిరుపతి, అన్నమయ్య, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.