నారాయణవనం మండలంలోని తుంబూరు చెరువుకు తుపానుతో వర్షపు నీరు భారీగా చేరింది. చెరువు కట్ట ఓ వైపు బలహీనంగా ఉన్నట్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తహసీల్దార్ ప్రమీల జేసీబీ సాయంతో కట్ట బలహీనంగా ఉన్నచోట మట్టిని నింపి పటిష్టపరిచారు. చెరువుకు గండి పడకుండా ఉండేందుకు వీలుగా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తాసిల్దార్ తెలిపారు.