ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులను ముంచేసిన మిచౌంగ్ తుపాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:57 AM

మిచౌంగ్ తుపాన్ కోస్తా జిల్లాలో రైతులను నిండా ముంచేసింది. లక్షల ఎకరాల్లో పంటను ముంచేసి రైతుల ఆశలను గల్లంతు చేసింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి పంట వర్షానికి దెబ్బతింది.
గుంటూరు జిల్లాలో శనగ పంట 10 వేల ఎకరాల్లో నీట మునిగింది. మిర్చి పంట 30,295 ఎకరాల్లో దెబ్బతింది. బాపట్ల జిల్లాలో మిర్చి 8,820, శనగ 8 వేలు, పొగాకు 5 వేలు, అపరాలు 2వేలు, అరటి 1415, వేరుసెనగ 1820 హెక్టార్లలో దెబ్బతిన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com