గడిచిన మూడేళ్ళలో ప్రభుత్వరంగ బీమా కంపెనీలైన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం 17450 కోట్లు మూలధనం కింద అందించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ భగవత్ కరాద్ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైయస్ఆర్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి నేషనల్ ఇన్సూరెన్స్‌కు 2400 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌కు 50 కోట్లు, యునైటెడ్ ఇన్సూరెన్స్‌కు 50 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరానికి నేషనల్ ఇన్సూరెన్స్‌కు 3175 కోట్లు, ఓరియంట్‌ల్ ఇన్సూరెన్స్‌కు 3170 కోట్లు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు3605 కోట్లు అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎన్ఐసీఎల్‌కు 3700కోట్లు, ఓఐసీఎల్‌కు 1200 కోట్లు, యుఐఐసీఎల్‌కు 100కోట్లు మూలధన సాయంగా అందించినట్లు తెలిపారు. ఇదికాక ఇన్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సాల్వెన్సీ కోసం మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు ఫర్ బేరెన్స్ మంజూరు చేస్తోందని తెలిపారు. ఎన్ఐఏసీఎల్ బీమాసంస్థకు 2013-14 ఆర్దిక సంవత్సరం నుండి 2023-24 ద్వితీయ క్వార్టర్ వరకు టాక్స్‌లు పోగా వచ్చిన లాభం 11439 కోట్లు, యుఐఐసీఎల్ పదేళ్ల కాలంలో టాక్స్ అనంతరం వచ్చిన లాభం 13655 కోట్లు, ఓఐసీఎల్‌కు పదేళ్లలో 15766 కోట్లు, ఎన్ఐసీఎల్‌కు పదేళ్లలో టాక్స్ అనంతరం వచ్చిన లాభం 16110 కోట్లు అని మంత్రి తెలిపారు.అలాగే అదనపు చెల్లింపులు బీమా సంస్థలపై ప్రభావం చూపాయని, 2012 ఆగస్టు 1 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ బకాయిలు 3429 కోట్లు 2017-18 సంవత్సరంలో చెల్లించినట్లు, 2017 ఆగస్టు 1 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ బకాయిల కింద 2022-23 సంవత్సరంలో 7931 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. అలాగే 2020-22 మధ్యలో కోవిడ్ క్లెయిమ్‌ల రూపంలో 6992 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అదనపు బాధ్యత కింద 2019లో పెన్షన్ కొరకు 4284 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.