కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు ప్రతిరోజు రైలు నడపాలని కర్నూలు ఎంపీ సంజీవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ కేంద్రంగా త్వరలోనే పరిపాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలు, నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రజలు అక్కడకు వచ్చేలా ఈ రైలును ఏర్పాటు చేయాలని అన్నారు.
అలాగే కర్నూలు నుంచి ముంబై వెళ్లే రైలుకు మద్దికేర, కోసిగి, ఆదోని స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.