మద్యం విషయంలో మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
మణిపూర్ సీఎం ఎన్. బీరెన్ సింగ్ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రంలో 30 ఏళ్లకు పైగా సంపూర్ణ మద్య నిషేధం తర్వాత మద్యం తయారీ, ఉత్పత్తి, తదితర అంశాలపై ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతోపాటు అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది.