పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు కర్నాటకలోని ఓ ప్రైవేట్ సంస్థ ప్రయత్నిస్తోంది. మైసూర్ మునిసిపల్ కార్పొరేషన్ సహాయంతో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్‌లను రీసైకిల్ చేసి పర్యావరణ అనుకూలమైన టైల్స్‌గా తయారు చేస్తున్నారు. మైసూర్‌లోని విద్యారణ్యపురంలో జాగృతి టెక్ పరిశ్రమను ప్రారంభించింది. ఈ ప్లాస్టిక్ టైల్స్ సిమెంట్ టైల్స్ కంటే చౌకగా మన్నికైనవి అని జాగ్రిత్ టెక్ డైరెక్టర్ దినేష్ తెలిపారు.