టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వంను రద్దు చేశారు. డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగారని మహువా పై ఆరోపణలున్నాయి. లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ లను ఆమె వేరే వారికి ఇచ్చారని నిర్దారణ అయ్యింది. ఎథిక్స్ కమిటి రిపోర్టు ఆధారంగా లోక్ సభలో చర్చ జరిగింది. చర్చ తర్వాత ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.