పెనుకొండ కొండ పైన నిర్మించ తలపెట్టిన శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం నిర్మాణ పనులను త్వరలో ప్రారంబిస్తాం అని ఇస్కాన్ జాతీయ అద్యకులు మధుపండిట్ దాస తెలిపారు. శుక్రవారం కొండ పైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దేవాలయం నిర్మాణ కోసం కేటాయించిన 4. 88 హెక్టర్ ల భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఘనగిరి లక్ష్మి నరసింహ స్వామీ టెంపుల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షులు, న్యాయవాది జె. ప్రతాప రెడ్డి పాల్గొన్నారు.