గర్భిణీలందరూ పౌష్టిక ఆహారం తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. శుక్రవారం సోమందేపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వైద్య చికిత్స నిమిత్తం విచ్చేసిన గర్భిణీలకు గత నాలుగున్నర సంవత్సరాలుగా పౌష్టిక ఆహారం, భోజన వసతిని సవితమ్మ ఆధ్వర్యంలో కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, టీడీపీ నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.