పెనుకొండ మండలం మరవపల్లి గ్రామానికి చెందిన అంజనేయులు 4నెలల కిందట మిద్దె మీద నుంచి పడి ప్రమాదవశాత్తు చనిపోవడంతో మృతుని భార్య లక్ష్మీ దేవమ్మకు వైయస్సార్ బీమా కింద రూ ఐదు లక్షలు మంజూరు కావడం జరిగిందని శుక్రవారం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ రెడ్డి, నారాయణ, అంజనాయక్, సచివాలయం కన్వీనర్లు ఆదినారాయణ, వెంకటేష్, చిన్నఅంజి, సచివాలయ సెక్రెటరీ జమీర్, వాలంటీర్స్ పాల్గొన్నారు.